ప్రారంభమైన మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్.. మిష‌న్ ప్రారంభ‌మైందని ట్వీట్

కరోనా కష్టకాలంలో నటుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జరిగాయి. తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ లాంచ్ కాగా, ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదనే ఆశయంతో చిరంజీవి ఈ మహత్తర కార్యాన్ని మొదలు పెట్టారు. అయితే ఇది నేటి నుండి మొదలు కానుండడంతో చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ.. మిషన్ మొదలైంది. ఇక ఆక్సిజన్ దొరక్క చనిపోయారనే వార్తలు మనం వినకూడదు అంటూ చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.