ఏలూరు జనసేన కార్యాలయంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

ఏలూరు, రాష్ట్ర జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ డా పద్మభూషణ్ చిరంజీవి 67వ జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా నేడు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. అనంతరం సుమారు 50 కేజీల స్వీట్లు పవర్ పేట రోడ్డులో వెళ్ళే వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ఉపాధ్యక్షులు బొత్స మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాసు, బొద్దాపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు.