ఏటుకూరు గ్రామంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు, ఏటుకూరు గ్రామములో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ చిరంజీవి జన్మదిన కేక్ ను కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ తెలుగు సినిమా వినిలాకాశంలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా అట్టడుగు స్థాయి నుండి అనితరసాధ్యమైన మెగాస్టార్ గా గత నాలుగు దశాబ్దాలుగా తన నటనా విశ్వరూపంతో డాన్సులు, ఫైట్స్ తోటి ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టించి తెలుగు సినిమా చరిత్రలో క్రోత్త ట్రేండ్ తోటి కలెక్షన్ల సునామితో ఔరా అనిపించే విధంగా తెలుగు సినిమా స్టామినాను ఏర్పరచిన తెలుగు సినికళామాతల్లి ముద్దుబిడ్డ చిరంజీవి అని వెంకట రత్తయ్య అన్నారు. ఉదయ్ చంద్రరావు మాట్లాడుతూ ఎందరో నూతన నటులకు స్పూర్తి ప్రదాత నిరంతరం కోత్తతరం కోసం పరితపించే ఆంధ్రుల అభిమాన నటుడు మన కోణిదెల శివశంకర్ వారు ప్రసాద్ అని అన్నారు. 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి అటు ప్రజలను ఇటు చలనచిత్ర పరిశ్రమ కార్మికులను నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోన్న ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమన్నారు. మాజి ఇన్చార్జి సర్పంచ్ దానారావు మాట్లాడుతూ తెలుగు సినిమాలోని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అందరివాడు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు పుట్టినరోజు సందర్భంగా గ్రామమలోని పేద ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంపును సేఫ్ హ్యండ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ మూర్తి కనకాల ఎం.డి (చిన్న పిల్లలు), డాక్టర్ మంత్రి అంజలి ఎం.డి (గెనరల్) సహకారంతోటి పేద ప్రజలకు ఉచితంగా రక్తపరిక్షలు, ఈ.సి.జి, షుగర్, బి‌పి మరియు పలు రకాల వ్యాధులను చూసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 450 మంది పేద ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి యన్.గోవిందరావు, డి. ఉదయ్ చంద్రరావు, కార్యదర్శి పి. గంగాధరరావు, జనసేన గుంటూరు నగర సంయుక్త కార్యదర్శులు యన్.నవీన్, టి.గంగారాజు, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు డి.వాసు, టి.రమణ, బి.సాయి, యు.ఆంజినేయలు, యన్. చంద్రశేఖర్, జి.మార్కండేయలు, యన్.గణేష్, కె.నాగరాజు, చిరంజీవి అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.