చిరంజీవి జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు

పాలకొండ, నడుకురు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా సాయి మారుతి మందిరంలో వీరఘట్టం మండలం మెగా అభిమానులు జనసేన పార్టీ నాయుకులు జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన ఉత్తరాంధ్ర చిరంజీవి మానవ సేవా సంఘం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు బి.పి.నాయుడు, జనసేన జానీ ఇద్దరూ మాట్లాడుతూ… చిరంజీవి అంటే సేవాతత్వం, చిరంజీవి అంటే కల్మషం లేని వ్యక్తి, చిరంజీవి అంటే కళామతల్లి ముద్దుబిడ్డ, చిరంజీవి అంటే ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఒక్కడిగా వచ్చి ఒంటరిగా ప్రయాణం చేసి మూడు దశాబ్దాలుగా మెగాస్టార్ గా వెలుగుతున్న వెండితెర ఇలవేల్పు కొణిదెల చిరంజీవి. ఎన్నో కష్టాలను ఒడిదుడుకులును తట్టుకోని ఈరోజు మెగాస్టార్ గా ఎదిగి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటు మురళి, మత్స కృష్ణారావు, వాన కైలాష్, పూజారి చిన్ని, పవన్ సాయి వెంకట్ రావు నాయుడు, మెగా అభిమానులు, గ్రామ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.