నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

నరసరావుపేట చిరంజీవి యువత అధ్యక్షులు అద్దేపల్లి ఆనందబాబు ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ లో చిరంజీవి జన్మదిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని, శ్రీకృష్ణదేవరాయ కాపు అన్నదాన సత్రం చైర్మన్ రాయల శ్రీనివాసరావు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు జి వి ఎస్ ప్రసాద్ పాల్గొని బర్త్డే కేకును కోసి చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ మరియు సదానంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేయడమైనది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం వ్యాప్తంగా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి కరోనా సమయంలో పేషెంట్లకు ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారని, అలానే సినీ కార్మికుల ఇబ్బందులను గుర్తించి వారికి ప్రతి నెలా చిల్లర సరుకులు ఏర్పాటుచేసి వేలమంది కార్మికులను కాపాడారని, అలానే ఈ పుట్టినరోజు సందర్భంగా తండ్రిగారైన కొణిదల వెంకట్రావు పేరు మీద చిత్రపురి కాలనీలో కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారని, తన నటనతోనే కాక ప్రజలకు అభిమానులకు అండగా ఉంటూ వారి మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం అన్నారు. కార్యక్రమంలో కృష్ణం శెట్టి గోవిందు, షేక్ మౌలాలి, అచ్చుల సాంబశివరావు, అబ్దుల్ రవూఫ్, ఆర్కే యాదవ్, బెల్లంకొండ అనిల్, వంశి నాగుల్ మీరా, బోనం జయరామ్, సైదా, గుప్తా శ్రీకాంత్, రాజా భరత్, మిరియాల సోము, దుర్గా కుమారి, చిన్నుపల్లి సాంబ, ధమలం కొండలు, వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి శీను, వల్లంశెట్టి శ్రీను, చంటి, పోతంశెట్టి రాము, లక్ష్మీనారాయణ, జేష్ఠ మల్లి యలామాల కొండ, నూతి నారాయణ మరియు అభిమానులు పాల్గొన్నారు.