జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన ముమ్మారెడ్డి

కూకట్ పల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళే విధంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ మరియు శతఘ్ని న్యూస్ సమ్యుక్తంగా రూపొందించిన 2024 క్యాలెండర్ ను కూకట్పల్లి నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కొల్లా శంకర్ ఆధ్వర్యంలో శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల సమక్షంలో ఆదివారం కూకట్ పల్లి జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం నాయుడు నిమ్మకాయల జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ చేసిన కార్యక్రమ వివరాలను ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శతఘ్ని న్యూస్ జనసేన పార్టీకి చేస్తున్న కృషి విలువకట్టలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంజి, భావిశెట్టి గోపి, గంట నవీన్, మధుసుదన్ రెడ్డి, సుబ్బు, నాగయ్య, సిహెచ్ వరహాల బాబు, రామచంద్ర, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.