సూరపురం జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

నిడదవోలు మండలం సూరపురం గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను సూరపురం జనసైనికులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు కుర్చీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరపురం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.