మెడికల్‌ కౌన్సిల్‌ పరీక్ష హాల్ లో సినీ సందడి

హీరోయిన్‌ సాయిపల్లవి విదేశాలలో డాక్టర్‌ కోర్సును పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మెడిసిన్‌పై ఉన్న కోరికతో విదేశాలకు వెళ్లి అక్కడ మెడిసిన్ పూర్తి చేసింది. విదేశాల్లో మెడిసిన్‌ చేసిన ప్రతిఒక్కరూ కూడ ఇండియాలో డాక్టర్‌గా గుర్తింపు పొందాలంటే మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఇండియాలో ప్రాక్టీస్‌కు కచ్చితంగా మెడికల్‌ కౌన్సిల్‌ పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి.. అందుకే సాయిపల్లవి కేరళ తిరుచ్చిలోని ఎంఎఎం కళాశాలలో ఆ పరీక్షకు హాజరై పరీక్ష రాసింది. ఎగ్జామ్ సెంటర్ లో సాయిపల్లవిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెతో సెల్ఫీలకు, ఫొటోలకు ఎగబడడంతో పరీక్ష కేంద్రంలో సినీ సందడి నెలకొంది.

కరోనా కారణంగా ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజ్‌లు ధరించినా కూడ అందరూ గుర్తుపట్టడంతో పరీక్ష అయిపోయాగానే వచ్చే సమయంలో ఇతర విద్యార్థినులతో సెల్ఫీలు దిగేందుకు ఓకే చెప్పింది.