అవినీతిరాజకీయ ప్రక్షాళన జనసేనపార్టీ తోనే సాధ్యం

  • అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: జి. మాడుగుల మండలం, వంజరీ పంచాయితి, గొయ్యి గుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు వారితో సమావేశమైన జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామస్తులే స్వచ్ఛందంగా జనసేన పార్టీ నాయకులకు సమావేశం కావాలని ఆహ్వానించడం పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ ఎలా ఉందో చెప్పవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో వివిధ మండల నాయకులు మౌళిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ, వైఖరి, గిరిజన నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలు, సంక్షేమ పథకాల రూపేణా సంక్షోభంలో రాష్ట్ర ఆర్ధిక స్థితి వంటి విషయాలపై గిరిజన జాతి ప్రజలకు మండల నాయకులు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ వారికి చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య గ్రామస్తులనుద్దేశించి ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు అన్నివర్గాల ప్రజలకు తీవ్రమైన మోసం చేసింది ఇప్పటికి చేస్తూనే ఉంది కాని ఆ విషయాన్ని గుర్తించలేకుండా ఉచిత పథకాలతో డబ్బుపంచే విధానాన్ని తెచ్చి ఆ విషయాన్ని ప్రజలు తమకు జరిగే నష్టాన్ని గుర్తించలేకుండా చేశారు. అయితే ఇక్కడ ఒకవిషయాన్ని రాష్ట్ర ప్రజలు, మనగిరిజన ప్రజానీకం కూడా గుర్తుపెట్టుకోవాలి మనిషి సహజ లక్షణం ఏమిటంటే ఉచితాల మాటున డబ్బుతో రాజకీయాలను ముడిపెడితే సగటు పౌరుడుకి జరిగే నష్టాలను గుర్తు పెట్టుకోలేరు. అంతటి సూక్ష్మ జ్ఞానంతో సామాన్యులు ఆలోచించలేరు. సరిగ్గా ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా చక్కగా తమ అవినీతి రాజకీయాలకు వాడుకుంది. కానీ గిరిజన విద్యావంతులైన నేటి యువత ఇప్పుడు వాస్తవిక ధోరణితో ఆలోచించి జనసేన పార్టీ ద్వారా మార్పు కోసం తమకు తాముగా జనసేన పార్టీకి చేరుతున్నారు. గ్రామ పర్యటన చేస్తూ గిరిజనప్రజాలకు చైతన్యం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామం జనసేన పార్టీ నాయకులతో ఒక సమావేశం నిర్వహించండని ఆహ్వానం పలికిందంటే ఈ గ్రామస్తుల యొక్క అభ్యుదయబావలను అర్థం చేసుకోవచ్చు. గిరిజన ప్రజలారా ఈ సందర్బంగా మేము మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం తమ జాతికి రక్షణగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు తమ జాతి ప్రజల ఓట్లతోనే గెలిచి చట్టసభల్లో జాతికి అన్యాయం చేసే తీర్మానాలు చేస్తున్నప్పుడు కూడా ఉత్సవ విగ్రహాలలా దిక్కులు చూస్తూ కూర్చోవడం జాతికి చేసిన పెద్ద ద్రోహం గిరిజన జాతి ఆస్తిత్వంపై మంతగలిపే తీర్మానాలకు సహకరించే ద్రోహపు బుద్ది వీళ్ళకి రావడం ఇప్పటికి మాకు అంతుపట్టని విస్మయం కలిగించే విషయం. గిరిజన జాతికిచ్చే మా సందేశం ఏమిటంటే ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు అత్యంత పారదర్శక రాజకీయ పార్టీని ఎన్నుకోవాలి మన కర్మ ఏమిటంటే దబ్దాలుగా అవినీతి, అక్రమాలే ప్రధాన ఎజెండాగా వచ్చే పార్టీలను ఆశ్రయించడం కానీ ఇప్పుడు పారదర్శక రాజకీయాలు, అవినీతిపై అలుపెరగని పోరాటం చేసే పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇప్పటికైనా పోయేందేమి లేదు జనసేనానికి తోడుగా నిలబడదాము. జనసేనపార్టీ ప్రభుత్వ స్థాపనకు మనవంతు సహకరిద్దాం మన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేద్దాం రానున్న ఎన్నికల్లో బూర్జవ అవినీతి పార్టీలను తరిమి కొట్టి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దాం. నాకో చట్టం నీకో చట్టం కాదు తప్పు చేస్తే నా తల అయిన తీసే చట్టం తెద్దామని సాక్షాత్ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక్కడ అతని నిబద్ధత, నిజాయితీ, ప్రజా పాలన పరమైన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందామన్నారు. సగటు గిరిజనుడు రాజకీయ విచక్షణ దృష్టితో ఓటు వేస్తే వైసీపీ, టీడీపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావు ఇది వాస్తవమని అన్నారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు చంటిబాబు, లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజానికమంత గంగులయ్య చేతుల మీదుగా కండువాలు కప్పుకుని గొయ్యిగుంట గ్రామస్తులు జనసేనపార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల నాయకులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, అంకిత్ తాంగుల రమేష్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, చింతపల్లి నాయకులు ఉల్లి సీతారాం, కూడ అబ్బాయి దొర, హరి, శ్రీను, వీరన్న, వెంకటేష్, కొండబాబు, సంతోష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.