రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు

హైదరాబాద్: మార్చి 11. మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠున్ని ప్రార్థించారు.