సీఎం సార్.. దయచేసి రోడ్డు వేయండి మహాప్రభో: జనసేన బుల్లాకింగ్

గుడ్లవల్లేరు: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆదివారం #GoodMorningCMsir జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలంలో ఉన్న 5పంచాయతీలు వెళ్లే గ్రామాలను రోడ్ల గురించి నిరసన తెలియజేయడం జరిగింది.. కట్టావనీచెరువు, చింతలగుంటా, తాడిచర్ల, పురిట్టిపాడు, చిన్నగోన్నూరుల మీదుగా ప్రతిరోజు వందల మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్డుపై సుమారు 7 కిలోమీటర్ల మేర గుంతలు పడి రోడ్డు దారునమైన పరిస్థితి లో ఉంది. సీఎం సార్ స్కూలుకు వెళ్లే బిడ్డల కోసం రోడ్డు వేయండి.. ఈ రోడ్డు మార్గాన్ని వెళుతుండగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దయచేసి సీఎం గారూ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారూ ఈ ఐదు పంచాయతీకి ఒకటే రోడ్డు మార్గం ఆ రోడ్డును బాగు చేయాలని మనస్పూర్తిగా మీకు తెలియజేస్తూ.. దయచేసి రోడ్డు వేయండి మహాప్రభో #GoodMorningCMsir అని గుడ్లవల్లేరు మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జనసేన బుల్లాకింగ్ (త్యాగరాజు) నిరసన తెలియజేడం జరిగింది.