రఘునాథపురంలో బత్తుల అధ్వర్యంలో వైస్సార్సీపీ నుండి జనసేనలోకి భారీ జాయినింగ్స్..

  • 145వ రోజు రఘునాథపురం గ్రామంలో ప్రారంభమైన జనంకోసం జనసేన మహాపాదయాత్ర
  • పాదయాత్రలో భాగంగా జనసేన జెండా ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ ..
  • ముందుగా శ్రీరాంపురం గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి రఘునాధపురం గ్రామం వరకు ర్యాలీగా ముందుకు సాగారు..
  • అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు..

రాజానగరం: అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను నిత్యం క్షేత్రస్థాయిలో రాజానగరం నియోజకవర్గంలో ప్రజానీకానికి చేరువ చేసి.. మునుపెన్నడూ లేని విధంగా జనసేన పార్టీని నియోజకవర్గంలో బలియమైన శక్తిగా తయారుచేస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ నాయకులు బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో.. శుక్రవారం రఘునాథపురం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ పార్టీ నేతలు గోనబోయిన వీరాస్వామి, బోల్లేపల్లి త్రిమూర్తులు, చిచ్చారి వీర్రాజు, యర్రా వీర వెంకట సత్యనారాయణ, గోనబోయిన సూరిబాబు, బోల్లేపల్లి గాంధీ, గోనబోయిన విష్ణు, తిక్కన కృష్ణ, మందాల సత్తిబాబు, రేలంగి సతీష్, రేలంగి రామకృష్ణ, పడమటి వెంకటేష్, వెలుగంటి వెంకటేష్, పడమటి రాజేష్, మన్యం ప్రసన్న కుమార్, మట్ట శివ కుమార్, మందాల సత్తియ్య, రేలంగి చందు, మట్ట గణేష్, మట్ట శివనాగు, ఏకుల వీర వెంకట్రావు, గోనబోయిన గణేష్, గోనబోయిన కళ్యాణ్, పలివెల లోవరాజు, బోల్లేపల్లి విజయ్, బోల్లేపల్లి వినయ్ కుమార్, మందాల మణికంఠ, మందాల వెంకటరమణ, జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఈ రాష్టానికి గాని.. మా నియోజకవర్గానికి గాని అభివృద్ధి అనేది జరుగుతుందని.. ప్రస్తుతం అధికార పార్టీ వారు చేసే పనులు చూసి ప్రజలు విసుగు చెందారని.. ఇళ్ల స్థలాలు ఇచ్చాము అని డప్పు కొట్టుకునే ఈ ప్రభుత్వం రఘునాదపురం గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందో చూపించమనండి అని సవాలు విసిరారు.. అలాగే జీడీ మామిడి ఎక్కువగా పండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం జీడి మామిడి రైతులు ఎదురుకుంటున్న సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. సరైన ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూర్తి ప్రణాళికను సిద్ధం చేసి రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. అదే విధంగా అభివృద్ధి పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియజేస్తూ ప్రకృతి వనరులను దోచేసి మీ ప్రాంతం అభివృద్ధి చేస్తాం అని కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలనీ చూస్తుందని కానీ ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మే అవకాశం లేదని ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ వైస్సార్సీపీ తట్టా బుట్టా సద్దె రోజు త్వరలోనే రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రఘునాధపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.