ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తగుంట స్మశానంలో గ్రావెల్ తోలించాలన్న సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. గ్రావెల్ తోలుట సమస్యపై ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎక్కడ ఉంది. ఇప్పటికీ కనీసం ఒక మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్లి బూడుచుకోవడానికి కూడా సరైన దారి, వసతులు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. గత ఐదు నెలల క్రితం ఒక మనిషి చనిపోతే మోకాల్లోతు నీళ్లలో శవాన్ని తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేసిన పరిస్థితి అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఎంతమంది నాయకులుగా వచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలు అయినా కానీ సర్వేపల్లి గ్రామంలో ఐదు కులాలవారు వినియోగించుకునేటువంటి కొత్తగుంట స్మశానాన్ని ఆధునీకరించండి అని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసిన కానీ ఇప్పటివరకు కనీసం పట్టించుకోలేదు. వర్షాకాలం వస్తే వర్షపు నీళ్లతో నిండిపోతే శవాన్ని తీసుకెళ్లి ఎక్కడ గట్టు కనిపిస్తే ఆ నీళ్లలో వెళ్లి ఆ గట్టుమీద బూడుచుకునేటటువంటి పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు అయిన సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గ్రామాలలో స్మశానాలు లేక, స్మశానాలకు దారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతున్నారు. మీరు దృష్టి పెడతారా..? లేదంటే జనసేన గళం గల్లీ నుంచి ఎక్కడికి వినిపించాలో వినిపిస్తాం, నిరసనలు చేపడతాం. అవసరమైతే ధర్నాలు అయినా నిరాహార దీక్షలు చేసే దానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, నవీన్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం భాయ్, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.