వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నా.. రేణూదేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్టుగా వెల్లడించారు.. ఓ వెబ్ సిరీస్ లో చేసేందుకు రేణు దేశాయ్‌ సిద్దం అయ్యారు.. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందట ఈ విషయాన్ని రేణూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకొస్తున్నాను. నేను ఓ అందమైన వెబ్ సిరీస్ కు సంతకం చేశానని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా, ఎక్జయిటింగ్ గా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తా. సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళాప్రయాణానికి మీ దీవెనలు, ప్రేమను అందించాలని కోరుతున్నానని పోస్ట్ లో పేర్కొంది.