నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

కళ్యాణదుర్గం, ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో మొక్కజొన్న అరటి తోట పండిస్తున్న రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వేలల్లో, లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అరటి పంట రైతులకు తక్షణమే 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. వరి, మొక్కజొన్న రైతులకు 50 వేల రూపాయలు, మామిడి పంట రైతులకు తగిన మొత్తంలో పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మిర్చి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కవులు రైతులు అప్పుల సతమతమవుతున్నారు. పంట నష్ట గణాంకాలను వర్గాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని వ్యవసాయ సంబంధిత అధికారులను కోరుతున్నామని జనసేన తరపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, జనసేన నాయకులు జాకీర్ హుస్సేన్, ఉదయ్, తిమ్మరాజు, మరంపల్లి అనిల్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.