తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి

గుంటూరు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్ మరియు జిల్లా నాయకులు మీడియా సమమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ఆంధ్రరాష్ట్రం అకాల వర్షాల వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీడియా అలాగే ప్రజలందరూ చూస్తున్నారు ఒక్క ప్రభుత్వం తప్ప గతంలో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. ఈ అతి వృష్టిని కూడా తన గొప్ప లాగా చెప్పుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి గద్దెనెక్కాక నాలుగు సీజన్లు వచ్చాయి. ఏ సీజన్లోనూ పండించిన పంట ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. తానూ రైతుల ముఖ్యమంత్రినని, తన తండ్రి రైతుల కోసమే పుట్టదన్నట్టు ప్రకటనలు ఇచ్చుకునే ముఖ్యమంత్రి ఒక్క సీజన్లోనైనా రైతులను ఆదుకున్నారని జనసేన పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాము. ఆర్భాటంగా రైతులకి ఇస్తున్నామని చెప్పుకునే 13,500 రైతు భరోసాలో 6000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈయన మిగతా సొమ్ము అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. ప్రకటనల పేరు కోసం నాశనం చేస్తున్న ప్రజా సొమ్ముని కనీసం రైతులకి ఇచ్చినా వారు బాగుపడేవారు. గత ప్రభుత్వాలు రైతులకి వ్యవసాయ పరికరాలు, పనిముట్లు ఇచ్చేవి. అకాల వర్షాల నుండి పంటని కాపాడుకునేనేందుకు పట్టాలు కూడా ప్రభుత్వాలు అందించేవి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆ సబ్సిడీలు అన్ని ఎత్తేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము రైతులను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు రైతులు మాతో చెప్పిన మాట “గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా మాకు పట్టాలు ఇచ్చి ఉంటే మేము పంట రక్షించుకునే పరిస్థితి ఉండేది. రైతులకి తక్కువగా నష్టపోయేవారు” అని. రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చేసింది ఏంటయ్యా అంటే రైతులకి నిజంగా ఉపయోగపడే సబ్సిడీలన్నీ ఎత్తేసారు. రైతు భరోసా కేంద్రాలు అని ఒక పేరు పెట్టి వాళ్ళ నాయకుల ఇళ్లల్లో ఆ కేంద్రాలను ఏర్పాటు చేయించి రంగులని, అద్దెలని ఆర్బీకేల వల్ల వైసీపీ నాయకులూ లాభపడ్డారు గాని రైతు లాభపడలేదు. విత్తనాలు అందవు, ఫెర్టిలైజర్ లు దొరకవు, అయినా కూడా అప్పోసొప్పో చేసి రైతు పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. రైతుల కోసం సభ పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టడమే తప్పించి రైతులకి న్యాయం చేసిన పాపాన పోలేదు. అధికారులు ఏం చేస్తున్నారో తేలేదు. వ్యవసాయ శాఖా మంత్రి తనపై ఉన్న కేసుల గురించి కోర్టుల చుట్టూ తిరగడమే తప్పించి ఏ రోజు రైతులను ఏ విధంగా ఆదుకుందాం అని కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు. అధికారులు సైతం రైతులకి సీజన్ కి తగ్గట్టు వేయాల్సిన పంటల విషయంలో గాని, వాడవలసిన ఫెర్టిలైజర్ల విషయంలో గాని రైతులకి భరోసానిచ్చిన దాఖలాలు లేవు. కనీసం అసెంబ్లీ సెషన్స్ లోనైనా వీటి మీద సమీక్ష చేస్తారా అని చుస్తే అసెంబ్లీలో తన్నుకుంటున్నారు. రైతుల సమస్య పోయి వాళ్ళ సమస్య పెరిగిపోయింది. ఏ రోజునైనా నిరుద్యోగుల సమస్య మీదనైనా, రైతుల సమస్యల మీదనైనా చేర్చలు పెట్టిన పరిస్థితి లేదు. సెషన్ ప్రారంభమవ్వడం మొదలు స్కాముల మీద దూషించుకోవడాలు తప్పితే ప్రజా ప్రయోజనాల గురించి చర్చలు జరిగే పరిస్థితి లేదు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ అని చర్చ మొదలెట్టారు అది ఏటో పోయిందో తేలేల్దు. ఈ ముఖ్యమంత్రి విమర్శించేందుకే తప్పించి నిరూపించమంటే ఆ పని మాత్రం చెయ్యదు. సీఎం కుర్చీ ఎక్కింది మొదలు కూల్చివేతలతో మొదలెట్టాడు ప్రతీదీ స్కాం అన్నాడు, కూల్చేశాడు. కానీ నిరూపించడాలు గాని, సంబంధిత అధికారులపైనా గాని, వ్యక్తులపైనా గాని చెర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. రైతుల తరపున జనసేన పార్టీ వైసీపీని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి. లేనియెడల రైతుల పక్షాన పోరాటాలకు దిగుతాం. రైతుల పక్షాన నిరాహార దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా చేసి తీరుతామని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాము. అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారుదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మీ దుర్గ, మధులాల్, నెల్లూరు రాజేష్, తన్నీరు గంగరాజు, సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.