తెలంగాణ జనసేన నేతల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ.. నిరసన కార్యక్రమం

*జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

*జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల అరెస్ట్…!

మైనర్ బాలికకు న్యాయం చేయమని అడిగినందుకు గానూ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు
రాజలింఘం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళలను అలాగే గ్రేటర్ నాయకులను, జనసేన కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం.. దీనిని రాష్ట్ర యువజన విభాగం పూర్తిగా ఖండిస్తూ.. బాధితురాలీకు న్యాయం జరిగే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని.. వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పిలుపు మేరకు శనివారం ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యువజన విభాగ నాయకులందరూ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వీర మహిళా విభాగం అధ్యక్షులు భోగ హరిప్రియ, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గుండ్ల పవన్ కళ్యాణ్, మాలిక్, గోపి, త్రినాధ్, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.