దుబాయ్ ప్రయాణానికి షరతులు వర్తింపు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రెసిడెంట్ విసా ఉన్న వారికి ఇకపై ముందస్తు ICA అనుమతి అవసరంలేదు. కాకపోతే  కొన్ని షరుతులు మాత్రం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కోవిడ్-19 టెస్టు చేయించుకోవడం. దుబాయ్కు చెందిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధారిటీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హౌజింగ్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనావైరస్ సంక్రమణ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడంతో దుబాయ్ కు తిరిగి వెళ్లాలి అనుకునే వారు ముందస్తుగా దుబాయ్ ప్రభుత్వం అనుమతి పొందాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దుబాయ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు చేసింది. యూఏఈ కి తిరిగి వెళ్లాలి అనుకునేవాళ్లు తమ పాస్ట్ పోర్టు వివరాలను uaeentry.ica.gov వెబ్ సైట్ కు తమ ఈమెయిల్ ఐడీ తో లాగిన్ అయి పొందుపర్చాల్సి ఉంటుంది.