JEE మెయిన్స్‌ విజేతలకు కంగ్రాట్స్.. గర్వంగా ఉంది.. సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ లో చదువుకొనే  విద్యార్ధులు  జేఈఈ మెయిన్స్ లో తమ ప్రతిభ చాటారు. జేఈఈ మెయిన్స్ లో 500మందికిపైగా విద్యార్థులు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని సోమవారం తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించిన విద్యార్థులకు సీఎం కేజ్రీవాల్ కంగ్రాట్స్ చెప్పారు. అలాగే టీచర్లకు కూడా కంగ్రాట్స్ చెప్పారు. శుక్రవారం రాత్రి జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చాయి.

ఢిల్లీకి చెందిన ఐదుగురు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వందకు వంద శాతం మార్కులు సాధించారు. ఆగస్టులో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.”ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న 510మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారు.

వరుసగా మూడేళ్ల నుండి 2018లో 350మంది, 2019లో 473మంది, 2020లో 510మంది, అర్హత సాధించారు. ప్రతి విద్యార్థి, టీచర్ కు కంగ్రాట్స్. నాకు చాలా గర్వంగా ఉంది. 98శాతం రిజల్ట్స్ తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు ఇది మరో అతిపెద్ద విజయం” అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.