రాజధాని భూకుంభకోణంపై పూర్తి స్థాయి విచారణకు ఏసీబీ సిద్దం

అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన భూకుంభకోణం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని నాటి ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేయగా.. తాజాగా వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడ్ ట్రేడింగ్ పై సమగ్ర దర్యాప్తునకు ఏసీబీ రంగ సిద్ధం చేసుకుంటోంది. ఈ వ్యవహారం లో ఇప్పటికే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ…పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.

అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాల భూకుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని నాటి ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేయగా దాని ఫలితంగా తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం లో ఇప్పటికే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ…పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. అమరావతిలో రాజధాని వస్తుందని ప్రకటించడానికి ముందే తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ ముఖ్యులకు సన్నిహితులు బినామీల పేర్లతో దాదాపు 4,075 ఎకరాలను కొనుగోలు చేశారనేది ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణ.

ఈ భూమిలో 900 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా దళితుల అసైన్‌మెంట్ భూమి కూడా ఉంది. అంతేకాదు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో బినామీలతో భూములు కొన్న ప్రముఖులు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని బినామీలుగా పెట్టుకున్నారు. ఇటువంటి అనేక ఆరోపణలు అమరావతి భూకుంభకోణంలో ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం సిట్‌ వేసి ఆధారాలను బయటకు తీసింది.