కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం .. ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ పార్టీ కీలక నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ఇంకో 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ఇటీవల సోనియా, రాహుల్ గాంధీ ఆయన్ను హెచ్చరించడంతో ఈ విధంగా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయాంగా హాట్ టాపిక్ అయింది.

ఈ సందర్భంగా పార్టీ పదవుల విషంపై కూడా మాట్లాడారు. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. నేరుగా ఎన్నికయ్యే వారికి పార్టీ శ్రేణుల నుంచి మద్దతు ఉండదని అభిప్రాయపడ్డారు. లేకపోతే పార్టీ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంగానే ఉండాల్సి వస్తుందని చెప్పారు. జాతీయ స్థాయి అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి వరకు ఎన్నికల ద్వారానే నియమించాలని సూచించారు. సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్నికల ద్వారా వస్తే వారిని తొలగించడం కూడా కుదరదని వ్యాఖ్యానించారు. కాగా పార్టీకి పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడి వ్యవహారంపై ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి నేతల్లో ఆజాద్ కూడా ఒకరు కావడం విశేషం.