క్రౌడ్ ఫండింగ్ తో కనెక్ట్ అవ్వండి పారదర్శక పాలనలో భాగస్వాములవ్వండి

  • విలువలు, విశ్వసనీయతకు మారుపేరు పవన్ కళ్యాణ్
  • పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టండి
  • కార్వేటి నగరం మండల ప్రజలకు విజ్ఞప్తి చేసిన జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా. యుగంధర్ పొన్న కార్వేటి నగరం మండల ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.