కాలువ నిర్మాణం జరిపించండి: కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి కాలనీ వాసులు

అనంతపురం జిల్లా, ధర్మవరం, కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి కాలనీ లోని రైల్వే బ్రిడ్జి కింద గత సంవత్సరం పడ్డ వర్షాలకు నీరు చేరి అలానే ఉంది. ఆ నీరు పోవడానికి అక్కడ ఎటువంటి కాలువలు నిర్మించలేదు. నీటిని మోటార్ ద్వారా రెండుసార్లు బయటకు పంపినా మళ్ళీ నీరు వస్తోంది. ఇక్కడ దాదాపు నాలుగు వేలమంది నివసిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లాలన్న రావాలన్న ఇదొక్కటే దారి ఉండడంతో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు వైసీపీ కౌన్సిలర్ కు ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. సమస్య మాత్రం అలానే ఉంది అని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అక్కడ కాలువ నిర్మించి నీరుని వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్నూ శ్రీరాములు, కార్పెంటర్ రాజు, కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.