నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా జ్యోతి నగర్ కాలనీలో పర్యటించిన వినుత కోటా

*నో మై కాన్స్టిట్యూఎన్సీ ౩౦ వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా శనివారం రేణిగుంట పట్టణంలోని జ్యోతి నగర్ కాలనీలో శ్రీమతి వినుత కోటా పర్యటించి.. ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. జ్యోతి నగర్ కాలనీ లో సమస్యలు ప్రధానంగా డ్రైనేజీ కాలువలు వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని, పారిశుధ్యం సమస్య, సీసీ రోడ్లు లేవు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు తదితర సమస్యలను కాలనీ వాసులు వినుత కు తెలియజేశారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, నాయకులు త్యాగరాజులు, పార్థసారథి, భాగ్య లక్ష్మి, ఉమా మహేశ్వరి, జ్యోతి, నితీష్ కుమార్, చందు చౌదరి,గిరీష్, కొండయ్య, సిద్ధూ, సోము, జనసైనికులు పాల్గొన్నారు.