భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్త్కు హామీ యాత్రా కార్యక్రమం తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో 46వ డివిజన్ ఎస్. అచ్చుతాపురం రైల్వే గేటు ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నేడు భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలు చాలా అభద్రతా పరిధిలో ఉన్నాయనీ వీరు నేడు దయనీయమైన పరిస్థితులలో జీవిస్తున్నారన్నారు. ఒకపక్క ఈ వై.సి.పి ప్రభుత్వ విధానం వల్ల ఇసుక అధిక రేట్ల ప్రభావంతోను మరిల పక్క అనిశ్చిత ప్రభావంతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. దానికి తోడు ప్రభుత్వపరంగా ఎటువంటి అభివృద్ధి ప్రాజక్టులూ లేక వీరు కుటుంబాలని పోషించుకోడంలో ఇబ్బండులుకు గురీవుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఈ వై.సి.పి ముఖ్యమంత్రి ఎలాంటి ఉద్దీపన కార్యక్రమం చేపట్టకపోడం చూస్తుంటే వీరిమీద కక్షకట్టినట్టనిపిస్తోందన్నారు. పోనీ వచ్చే ఆ చాలీ చాలని కూలీని భోజనానికి ఖర్చు చేయకుండా ఇంటికి తీసుకెళ్ళుదామనుకుంటే అన్నా కేంటీనులు ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి పాపం మూటగట్టుకున్నాడని ఎద్దేవాచేసారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతు ఇచ్చి ఉమ్మడి మేనిఫెస్టోలోని భవన నిర్మాణ రంగ కార్మికుల పధకాన్ని పొందేందుకు సుగమం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి జగదీష్, కైలాసం వెంకట ఆదినారాయణరావు, శెట్టి జోగిరాజు, చొడపునీడి రామసతీష్ తదితరులు పాల్గొన్నారు.