డోర్ టు డోర్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సిటీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ మరియు టేకు రాము ఆధ్వర్యంలో పేర్రాజుపేట ప్రాంతంలోను, బడగంటి సురేష్ మరియు ధన శేఖర్ ఆధ్వర్యంలో సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీ ప్రాంతంలో జనంలోకి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ప్రజలకు మొదటిగా తమనాయకులు పవన్ కళ్యాణ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వీట్స్ అందచేసారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే బోయీలెవరు అన్న సంగతి మరిచి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడనీ, అధికారం వచ్చేదాకా ఓదార్పు యాత్ర, పాదయాతలు చేసి తీర అధికారాన్ని ప్రజలు ఇచ్చాకా పరదాలతో వారి మొఖాన్ని కూడా చూడటంలేదనీ, ఇదీ జగన్మోహన్ రెడ్డి అసలు నైజమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో పాలన చేస్తూ సిగ్గుపడే రీతిలో హైకోర్టుతో అనేక సందర్భాలలో చీవాట్లు తినడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈప్రభుత్వహయాములోనే చూస్తున్నామన్నారు. స్వాత్రంత్యం వచ్చిన తరువాత కాలంలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న సందర్భం ఇదే అని ఇదొక రికార్డన్నారు. రీకాల్ సదుపాయం ఉండిఉంటే ఎప్పుడో ప్రజలు ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని గద్దె దింపేసేవారని ఖర్మ కాలి అది లేకపోవడం దురద్రుష్టమన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో అడపా మాధవ్, దుర్గాప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.