భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం గురువారం 17వ డివిజన్ చిన్న మార్కెట్ సెంటర్ జగన్నాధ పురం నందు తల్లిబొయిన సత్యనారాయణ(శ్రీను) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతోను అక్కడున్న వారితో మాట్లాడి వారి కష్టసుఖాలపై వివరాలపై ఆరాతీసారు. భవన నిర్మాణ రంగ కార్మికులు నేడు దయనీయమైన పరిస్థితులలో ఉన్నారన్నారు. ఒకవైపు పనులు లేక ఆదాయం లేక కుటుంబాన్ని పోషించే పరిస్థితిలేక తమ కుటుంబ మహిళలను ఇళ్ళల్లో పాచిపనులకు పంపే పరిస్థితులకు లోను అవుతున్నారనీ, ఇది ఈ వై.సి.పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి పుణ్యమేననీ ఇందుకు తగిన మూల్యం ఈ ముఖ్యమంత్రి చెల్లించుకోవాలన్నారు. ఇలాంటి వాతావరణం వచ్చేలా ఇసుక లభ్యతని తనకబంధ హస్తాలలో ఇరికించుకుని పేదల ఉసురు పోసుకుంటోంది ఈ వై.సి.పి ప్రభుత్వం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు వి.ప్రసాద్ జి.సతీష్, ఎస్.మంగన్న, ఎం. వెంకటేష్, చెక్కా మాణిక్యాలరావు, పి.దుర్గారావు, సత్తిబాబు, రత్నకిషోర్ మరియు జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.