కరోనా మరణాలు.. కన్నీటి పర్యంతమైన మోదీ

దేశంలో కరోనా మహమ్మారి నిత్యం వేలమందిని బలితీసుకోవడంపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొవిడ్‌ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా మృతులను గుర్తుచేసుకుని బాధపడ్డారు. ”ఈ వైరస్‌ ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తీసుకెళ్లింది. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని మోదీ తడారని గొంతుతో చెప్పారు.