“అమరనాధుని” యాత్రకు అడ్డు తగిలిన కరోనా

అమరనాథ్ దేవాలయ బోర్డు  ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది.  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అమరనాథ్ దేవాలయ బోర్డు సమావేశంలో తెలిపారు.

బోర్డు సమావేశానికి జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము నేతృత్వం వహించారు.

2020 ఫిబ్రవరి నుండి అమరనాథ్ యాత్ర కోసం మొదలైన ఏర్పాట్లు, లాక్‌డౌన్‌తో దేవాలయాలపై పడిన ప్రభావం, కరోనా వైరస్ వ్యాప్తి మొదలగు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

జులైలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిన విదానం, ప్రస్తుతం అమలులోనున్న ఆంక్షలు జులై 31 వరకు కొనసాగే అవకాశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.

“అమరనాథ్ యాత్ర నిర్వహించే క్రమంలో చాలా మంది సిబ్బంది అవసరం ఉంది. ఇది కరోనా వైరస్ నియంత్రణకు  చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడుతుంది మరియు యాత్రికులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంది.” అని సమావేశంలోని సబ్యులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఏడాది యాత్రను రద్దుచేసిన కారణంగా భక్తుల కోసం వర్చువల్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ఈ సంమవేశoలో బోర్డు నిర్ణయo తీసుకుంది.