నటుడు సూర్యకు కరోనా పాజిటివ్.. కోలుకుంటున్నట్టు ట్వీట్

ప్రముఖ నటుడు సూర్య కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి తెలిపాడు. తనకు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నానని పేర్కొన్నాడు. కరోనా నుంచి మన జీవితాలు ఇంకా బయటపడలేదన్న సూర్య.. వైరస్ సోకినంత మాత్రాన భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించాడు. మహమ్మారి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. సూర్య ఇటీవల నటించిన ‘ఆకాశం నీ హద్దురా’’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.