టాలీవుడ్‌ హిట్ చిత్రాల దర్శకుడికి కరోనా!

మొన్నటి వరకు బాలీవుడ్ సెలబ్రిటీలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్‌పై పగబట్టింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడతున్నారు. తాజాగా హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అనీల్ రావిపూడి వెంటనే ఐసోలేషన్‌కు వెళ్ళారట.

ప్రస్తుతం అనీల్ రావిపూడి ఎఫ్ 3 అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ఇటీవల మైసూర్‌లో ప్రారంభమైంది. వెంకటేష్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల దృశ్యం 2 షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ రీసెంట్‌గా ఎఫ్ 3 చిత్ర బృందంతో కలిసారు. ఇప్పుడు అనీల్ రావిపూడికి కరోనా అని తెలియడంతో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. కాగా, ఎఫ్ 3 చిత్రం దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతుండగా, ఇందులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌, తమన్నా నటిస్తున్నారు.