హర్యానా ముఖ్యమంత్రికి కరోనా

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనావైరస్ సోకింది. ఆయన చేయించుకున్న కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే విషయాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వాళ్లంతా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవడంతో పాటు వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.