కరోనా చికిత్స ఆరోగ్యశ్రీలో భాగం చేయాలి

కరోనా వైరస్‌ బారిన పడి అనేక మంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్న కారణంగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ, బీజేవైఎం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మలక్‌పేట యశోదా ఆస్పత్రి ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పొరేట్‌ ఆస్పత్రు లు లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నా ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల బాషా, నాయకుడు ఆలె జితేందర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకమే గొప్పదని చెబుతూ సీఎం కేసీఆర్‌ కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌పథకాన్ని అమలు చేయకుండా పక్కన పెట్టారన్నారు. ఇటీవల హైకోర్టు ఆదేశిస్తేనే రెండు ఆస్పత్రులపై చర్యలు చేపట్టారని, మిగతా కార్పొరేట్‌ ఆస్పత్రుల వైఖరిని పట్టించుకోకపోవడంలో అంతర్యమేమిటో తెలియజేయాలన్నారు. ధర్నాలో బీజేపీ నాయకులు బి.నరసిం హ, మలక్‌పేట కన్వీనర్‌ సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20 మంది బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్టు చేశారు.