ఏలూరు నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరింది: రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరిందని పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పూర్తిగా అవినీతి మయంగా మారింది.. గవర్నమెంట్ వారు ఇస్తున్న బి ఫారంలో ఇళ్ళు కట్టుకోవాలంటే ప్రజాప్రతినిధులు లక్షా రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది అల్టిమేట్ జారీ చేసి లక్షా రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు..శానీటరి పూర్తిగా శూన్యం.. ఎక్కువగా అవినీతి జరుగుతుంది.. ఎంప్లాయీస్ దగ్గర 2 లక్షల నుండి 3 లక్షలు దాకా వసూలు చేస్తున్నారు.. అవినీతి తారాస్థాయికి చేరింది.. ఏలూరు హెడ్ క్వార్టర్స్ లో డిప్యూటీ సీఎంగా చేసిన ఆళ్ళనాని గారు సమస్యల మీద స్పందించడమే మానేశారు.. ఇతను అవినీతి నీ ప్రోత్సహిస్తున్నారు.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు..ఆ వైపుగా ప్రయాణం లో ఈరోజున కార్పోరేటర్లు జరుగుతున్న అవినీతి లో సరైన పంపకాలు జరగడం లేదని నిజానిజాలు తెలుస్తున్నాయి.. నిన్ననే ఎసిబి రైడ్ జరిగింది.. పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్ మీద జరగాలి.. ప్యానెల్ కమిటీ నిర్ణయాలు చేసి వాయిదా వేసి మళ్లీ ఆమోదం చెబుతున్నారు.. వైసీపీ పార్టీ కార్పోరేటర్లు అందరూ చేయాల్సిన పని బహిరంగంగా ఏలూరుకు ఎంత ఆదాయం వస్తుంది..ఏ ఏ విభాగాల నుండి ఎంతెంత వస్తుంది.. రోడ్లు డ్రైనేజీలకు, శానీటరీలకు ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఏలూరు పూర్తి స్థాయి బడ్జెట్ ఎంత అనేది నగర ప్రజలకు తెలియపర్చాలి.. వచ్చే నిధులను ఏం చేస్తున్నారో తెలియదు.. బ్లీచింగ్ జల్లే పరిస్థితి లేదు.. చాలా చోట్ల లైట్లు వెలగడం లేదు.. అలాంటప్పుడు ఏలూరుకు వచ్చే కోట్లాది రూపాయలు ఏమవుతున్నాయి.. ఇంటి పన్ను మార్చాలంటే వేల రూపాయలు, పంపు కనెక్షన్ కావాలంటే 50,60 వేలు అడుగుతున్నారు.. కొంతమంది కార్పోరేటర్లు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు.. దీని మీద కూడా ఎంక్వైరీ వేయాలి.. మొన్ననే కొన్ని సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశాం.. అప్పుడు కలెక్టర్ గారు రెవెన్యూ కీ అప్పులు ఎక్కువగా ఉన్నాయి అన్నారు.. రెవెన్యూ వస్తుంది దొంగ బుక్కులు దొంగ లెక్కలు చెప్పి గవర్నమెంట్ కు చేరకుండా చేస్తున్నారు.. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి.. మేయర్ గారు 2 వ సారి ఎన్నుకోబడ్డారు.. దాని మీద దృష్టి సారించాలి.. ఇక్కడ జరుగుతున్న అవినీతిని నివారించాలి.. కానీ మేయర్ గారు,కార్పోరేటర్లు కూడా అవినీతి లో భాగస్వాములు ఐతే అది సాధ్యం కాదు.. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిపాలన ఏవిధంగా ఉండాలో తెలియని వారు నాయకులుగా ఉన్నప్పుడు ఈ అవినీతి ఇంకా పెచ్చురేగిపోతుంది..ఓ వైపున అధికారులు, ఓ వైపున ప్రజా ప్రతినిధులు, ఎన్నికైన నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు.. ప్రజలకు ఎటువంటి రాయితీలు రాకుండా చేస్తున్నారు..1 రూ.కీ 10 రూ. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కానీ ఆ రూపాయికి 10 పైసలు కూడా అభివృద్ధి అనేది ప్రజలకు అందడం లేదు..కనీస మౌలిక వసతులు, రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ క్లీన్ చేసే విషయం.. ఈనెల 8 వ తేదీ నుండి ఆళ్ళనాని గారు గడప గడపకు పాదయాత్ర అంటున్నారు..ఏ మొహం పెట్టుకొని వెళ్తారు అని ప్రశ్నిస్తున్నాను.. ఏలూరు నియోజకవర్గం లో చాలా దారుణమైన పరిస్థితి చాలా దారుణంగా అవినీతి చేసిన ఘనత ఇప్పుడున్న నాయకులు, అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. కలెక్టర్ గారికి ప్రతి ఒక్క రికార్డులను పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది..ఈ విషయాలను ఏలూరు నగర ప్రజలకు తెలియజేయాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు.