టిడ్ కో ఇళ్ళ డాక్యూమెంట్స్ లబ్ది దారులకు అందించిన కౌన్సిలర్ దేవి హారిక

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘ 7వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు ఇంటి డాక్యుమెంట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, రెడ్డి సత్య నారాయణ, గండి స్వామి మరియు వార్డ్ సచివాలయ సెక్రటరీలు వీఆర్వో, లభిదారులు పాల్గొన్నారు.