ముమ్మిడివరంలో అంగరంగ వైభవంగా జనసేనాని జన్మదిన వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు అత్యంత వైభవంగా కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం పార్టీ కార్యాలయంలో వికలాంగులకు రైసు, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తదనంతరం ముమ్మిడివరం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు తదనంతరం ముమ్మిడివరం ఎస్సీ హాస్టల్ నందు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేశారు తరువాత ముమ్మిడివరం రెల్లి కార్మికులకు కూరగాయలు, చీరలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, జిల్లా జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • భారీ కేక్ కటింగ్ లో పాల్గొన్న పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా శనివారం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, మురమళ్ళ మాణిక్యాంబ అమ్మవారి ఆలయం దగ్గర భారీ కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. తదనంతరం పశువుల్లంక గ్రామంలో కేక్ కటింగ్ క్రార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం కొమరగిరి గ్రామంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జడ్పీ స్కూల్ నందు పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, జిల్లా జనసేన నాయకులు, మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • తాళ్ళరేవులో జనసేనాని జన్మదిన వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం, తాళ్లరేవు సంతపేట గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం రామన్నపాలెం గ్రామం నుండి తెలుగుదేశం, వైసిపి పార్టీ నుండి రేకాడి చిన మహాలక్ష్మి, వల్లిపూడి సుబ్బారావు, కొత్తల ధనుంజయ్, అంగాడి బాబ్జి మొదలగు 40 మంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అనంతరం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు. పి.మల్లవరం గ్రామంలో డాక్టర్ వి ఆర్ ఎన్ బి ప్రసాద్ ఏర్పాటుచేసిన మెగా రక్తదానశిబిరంలో పాల్గొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భోజనాలు కేరిజీలను పేదవారికి పంచడం జరిగింది. అనంతరం జార్జి పేట గ్రామంలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేసి, భవన నిర్మాణ కార్మికులతో సహ భక్తి భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, జిల్లా జనసేన నాయకులు, మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేసిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం చెంచుల గరువు గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం చెంచులకు, మాలమటిలకు, రెల్లి కులస్తులకు దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేశారు. వారి అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. అనంతరం చెయ్యేరు అగ్రహారం గ్రామంలో, అనంతరం కుండలేశ్వరం గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, జిల్లా జనసేన నాయకులు, మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.