ముమ్మారెడ్డికి మండలి రాజేష్ పరామర్శ

భావదేవరపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి శ్రీనివాస్ తండ్రి గోపాలరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పార్టీ నాయకులతో కలసి గోపాలరావు పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. ముమ్మారెడ్డి శ్రీనివాసరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. గోపాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. రాజేష్ తో పాటు పార్టీ నాయకులు సింహాద్రి పవన్, మండలి నరేష్ లు ముమ్మారెడ్డి శ్రీనివాస్ ని పరామర్శించిన వారిలో ఉన్నారు.