గ్రంథాలయం పైకప్పు కన్నాలైనా పూడ్పించండి: బాబు పాలూరు

  • వర్షా కాలం వచ్చేసింది, బొబ్బిలి గ్రంథాలయం పైకప్పు కన్నాలైనా మూయించండి ఎమ్మెల్యే శంబంగి గారు అంటూ డిమాండ్ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: గతంలో బొబ్బిలి గ్రంథాలయం మరమ్మత్తులు మరియు మౌలిక సదుపాయాల గురుంచి జనసేన పార్టీ ప్రశ్నిస్తే, వారం రోజుల్లో పూర్తి చేసేస్తున్నామని చెప్పిన అధికార పార్టీ, నేటికి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతుందో తక్షణమే సమాధానం చెప్పాలి. నిధులు మంజూరయ్యి సుమారు రెండవ సంవత్సరం కూడా దాటిపోతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని, ప్రస్తుతం వర్షాల వలన గ్రంథాలయం పైకప్పు కున్న కన్నాల వలన గ్రంథాలయం మొత్తం తడచి ముద్దైపోతుందని, కనీసం మహిళలకైనా టాయిలెట్ సదుపాయం లేదని, బోర్ వెల్ కూడా పాడైందని, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు టేబుల్స్ కూడా లేవని, బుక్స్ కూడా అవసరమైనవి లేవని విద్యార్థులు ఇన్ని సార్లు మొత్తుకుంటున్నా ఎందుకు ప్రభుత్వంలో చలనం రావడంలేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు గారు ఈ విషయంపై స్పందించి మరమ్మత్తులు జరిపించి కావలసిన కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *