ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం సర్వేపల్లి ఎమ్మెల్యేకి పరిపాటిగా మారింది

సర్వేపల్లి, అంతా తానే అభివృద్ధి చేశానని చెప్పుకొని తిరగడం కాదు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి… నియోజకవర్గంలో కాకమ్మ కథలు, కల్లబొల్లి మాటలు, ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం సర్వేపల్లి ఎమ్మెల్యేకి పరిపాటిగా మారిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి నుంచి తిక్కవరప్పాడు మీదుగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి (గొలగమూడి క్షేత్రానికి) వెళ్లే రహదారి భారీ గుంతలతో అస్తవ్యస్తంగా తయారైన సర్వేపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే అభివృద్ధి పక్కనపెట్టి ప్రతిపక్షాల పై విమర్శలు చేయడమే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే తిక్కవరప్పాడు మీదుగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి (గొలగమూడి క్షేత్రానికి) వెళ్లే రహదారి భారీ గుంతలతో అస్తవ్యస్తంగా తయారైన రోడ్డును బాగు చేయించండి. గొలగమూడికి వెళ్లాలి అంటే తిక్కవర పాడు, గొట్లపాలెం మీదుగా వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల పొడవు ధ్వంసమై అస్తవ్యస్తంగా ఉంటే మరి ఇప్పటి వరకు కనీసం గుంతలను పూడ్చిన దాఖలాలు అయితే లేవు. అదేవిధంగా వెంకటాచలం రైల్వే గేట్ మరమ్మతులకు గురైన సమయంలో నెల్లూరు నగరానికి తిక్కవరప్పాడు మీదుగా కనీసం 12 గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగించే రహదారి కూడా అదే. సర్వేపల్లి ఎమ్మెల్యే మాత్రం నేను అభివృద్ధి చేశానని పాలాభిషేకాలు చేస్తు కాలయాపన చేస్తూ ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప కనీసం రోడ్ల మరమ్మతు చేసిన దాఖలాలు కూడా లేవు. దయచేసి సర్వేపల్లి ఎమ్మెల్యే ఇకనైనా కళ్ళు తెరిచి గొలగమూడికి వెళ్లే రోడ్డు గుంతలు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. మేము గుంతలను పుడ్చతామంటే అడ్డుకుంటారు మీరు చేయరు మమ్మల్ని చేయనివ్వరు అమ్మ పెట్టదు అడుక్కుతినియధు అన్నట్టుంది సర్వేపల్లి ఎమ్మెల్యే తీరు. ప్రజాస్వామ్యం ప్రజల యొక్క ఇబ్బందులు మీకు పట్టవు. మీకు కావాల్సింది డబ్బు సంపాదించడం, దోచుకోవడం, దాచుకోవడం ప్రజలను ఆదుకోని, రహదారులు, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ధ్యాస మీకు లేనట్టుంది. ఇకనైనా మీరు మరి అభివృద్ధి చేసి ప్రజల మనసులో చోటయినా సంపాదించండి. ఈ కార్యక్రమంలో శివరాత్రి సందీప్, రవికుమార్, రహీం గారు, శ్రీను, శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.