జన సంద్రమైన ఏటుకూరు
కౌలు రైతు భరోసా యాత్ర కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వేలాది మంది జనసైనికులు రోడ్డు మీదకు వచ్చి పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు. పలువురు స్థానిక సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, యువత, ఆడపడుచుల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నా జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అంకితం. నాకు ఇంత ఘనస్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాన”ని అన్నారు. కంతేరు ప్రాంతంలోనూ జనసేన నాయకులూ, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.