ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నివారణకు మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు.