రైతులను నిండా ముంచేసిన మిచౌంగ్ తుఫాను

సీతానగరంలో నీట మునిగిన పొలాలను సందర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలకూ నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు వరద తీవ్రత తగ్గిన అనంతరం పంట నష్టంపై అంచన వేసిన నష్టపోయిన రైతులకు నాయ్యం చెయ్యాలని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేసారు.

  • ముగ్గుళ్ళ గ్రామంలో పర్యటించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ముగ్గళ్ల గ్రామంలో మిచౌంగ్ తుఫాను కారణంగా వరద ప్రభావం వలన పూర్తిగా నీట మునిగిన ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివాసముంటున్న ప్రజలతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని జనసేన పార్టీ తరపున తోడుగా అండగా ఉంటామని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి తెలియజేయడం జరిగింది.

  • నష్టపోయిన వరి రైతులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో మిచౌంగ్ తుఫానుకు నష్టపోయిన వరి రైతులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలిసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట మొత్తం నష్టపోయిన రైతులను పట్టించుకోకపోగా తడిసిన ధాన్యం ఎత్తడానికి కూడా గన్నీ బాగ్స్ ఇవ్వకపోగా చిరిగిన బాగ్స్ నందు ధాన్యం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని, పంట నష్టపోయి, ధాన్యం తడిసి రైతులు బాధపడ్తుంటే ధాన్యం కొనుగోలు చేస్తామని బస్తాకు 10 కేజీలు తరుగు పేరు పెట్టి జె టాక్స్ వసూలు చేస్తున్న అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • కూనవరంలో పర్యటించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం గ్రామం మిచౌంగ్ తుఫాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలకూ నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు వరద తీవ్రత తగ్గిన అనంతరం పంట నష్టంపై అంచనా వేసి నష్టపోయిన రైతులకు నాయ్యం చెయ్యాలని రాజానగరం నియోజకవర్గం నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

బుచ్చంపేట గ్రామ స్మశాన వాటికకు బత్తుల లక్ష రూపాయల ఆర్థికసాయం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బుచ్చంపేట గ్రామంలో 5 సంవత్సరాలుగా ఊర్లో స్మశాన వాటిక లేక స్థానిక ఎమ్మెల్యే 2019 ఎన్నికల ముందు స్మశాన వాటిక కట్టిస్తా అని చెప్పి కనీసం గెలిచిన తర్వాత గ్రామం వైపు చూడలేదని గ్రామస్తులు వాపోయరు. మిచౌంగ్ తుఫానుకు నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణకి స్మశాన వాటిక సమస్య గురించి తెలియజేయగా తక్షణమే గ్రామస్తులు, జనసైనుకులు, జనసేన నేతలు సమక్షంలో ₹1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం జనసేన పార్టీ తరుపున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.