నెల్లూరు జిల్లాలో తుఫాన్ బీభత్సం ..

నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది.  తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిలకి పైఎత్తు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ లో 74 టీఎంసీలకు పైగా నీరు చేరింది. దీంతో అధికారులు 1,70,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

లోతట్టుప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయంది. నిన్న సాయంత్రం నుంచి ఆహారం, తాగునీరు లేక వేలాది మంది ప్రయాణికులు అల్లాడుతున్నారు. తిప్పవరప్పాడు వద్ద వాగు, కైవల్య నది ప్రవాహం మధ్య చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. తుఫాన్ భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది పేద ప్రజలు నిరాశ్రుయులయ్యారు. వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో నిన్నటి నుంచి విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి గాఢాంధకారం నెలకొంది. పెన్నా, కైవల్య, కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.