దగా ప్రభుత్వం – దోపిడి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం: జనసేన పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దగా ప్రభుత్వం అని దోపిడీ ప్రభుత్వం అని బొలిశెట్టి అన్నారు. పెంటపాడు మండలం కస్సా పెంటపాడు గ్రామంలో రెండవ రోజు బుధవారం జరిగిన జనసేన పల్లెపోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీల విషయంలో ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేసిందన్నారు. మూడువందల యూనిట్లు దాటి వస్తే సంక్షేమ పథకాలను కట్ చేయడం దారుణం అన్నారు. పల్లెల్లో రైతు కుటుంబాల జీవితాలు అతలకుతలమయ్యాయి అని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించే ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. కనీసం మురుగునీరు పారుదల సమస్యలు కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాలకు ఉపయోగించవలసిన గ్రామ నిధులు సైతం దోచుకున్న దోపిడీ ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో చీకటి అలుముకుందని పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్ధ నాయకుడు సీఎం అయితే వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తీర్ణ పేరుతో వైసీపీ ప్రభుత్వం జనసేన సభ ప్రాంగణం కోసం స్థలాలను కేటాయించిన గ్రామ ప్రజల ఇళ్లలను కూల్చిందన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి కోర్టు నుంచి స్టే తేచ్చి వారికి అండగా నిలబడి తక్షణ సాయం కింద ప్రతి ఇంటికి లక్ష రూపాయల సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం జనసేన అధ్యక్షుడు పుల్లా బాబి స్థానిక నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, నర్రలాశెట్టిసంతోష్, నర్రలాశెట్టి చంద్రరావు, వాకల బాలాజీ, వీరభత్తుల శ్రీను, పంజాల గోపాలకృష్ణ, వీరభత్తుల పులయ్య, పేరిచర్ల నాగేశ్వరరావు, కాలి జగమోహన్ రావు, సయ్యద్ ఇమహిద్దీన్, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.