మంగళగిరిలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు: చిల్లపల్లి శ్రీనివాసరావు

  • రాజకీయ పార్టీల స్వేచ్ఛను హరిస్తున్న వైసిపి నేతలు
  • జనసేన జెండా చూస్తేనే హడలెత్తుపోతున్న వైసిపి మంగళగిరి నాయకులు
  • జగనన్న కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు
  • జనవాసానికి దూరంగా జగనన్న కాలనీలు

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఉదయం నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… పేదలందరికీ ఇల్లు పథకం కింద 28 లక్షల 30 వేల మందికి ఇల్లులు ఇస్తామని, తొలి విడతలో జూన్ 2022 నాటికి 18,63,552 గృహాలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా కేవలం 1,52,000 ఇల్లు మాత్రమే నిర్మించారు. జగనన్న కాలనీలకు రాష్ట్రవ్యాప్తంగా భూసేకరణకు 68 వేల 677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వైసీపీ ప్రభుత్వం వారు ఆ భూములు కొనుగోలు దానిలో వందల కోట్లు అవినీతి చేశారు. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేవలం వైసీపీ నాయకులకు వందల కోట్లు అప్పనంగా కట్టబెట్టడం కోసమే ఈ ” జగనన్న ఇల్లు – పేదలందరికీ ఇల్లు” పథకం. 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, ఆత్మకూరు, నవులూరు, దుగ్గిరాల గ్రామాల్లో జగనన్న కాలనీలను పరిశీలించడం జరిగింది. ఈ మూడు రోజులు పర్యటనలో భాగంగా ఆత్మకూరు జగనన్న కాలనీలో త్రాగునీరు సదుపాయం, సరైన రోడ్లు, రవాణా వ్యవస్థ, పాఠశాల, అంగన్వాడీ, సచివాలయం, వాలంటరీ, రక్షణ వ్యవస్థ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ప్రభుత్వం నుంచి సహకారం లేక నిర్మాణాల మధ్యలోనే నిలిచిపోయాయి, లబ్ధిదారులు ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులు, కేంద్రం ఇచ్చే 1 లక్ష 80 వేలు కూడా సిమెంటు, ఐరన్ రూపంలో విడతల వారీగా ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయినా పేదలకు ఇచ్చే ఇల్లు ఇంకా నిర్మాణ దశలోనే సగం పైగా ఉన్నాయి. సరైన నీటి వసతులు లేవు ఎటు చూసినా మురికి నీళ్ళు ఆ నీటి వల్ల చర్మ సమస్య వ్యాధులు అనారోగ్య పాలవుతున్నారు, చికిత్స చేయించుకుంటానికి వెళ్లాలన్నా 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే దుగ్గిరాల జగనన్న కాలనీ పరిస్థితి కూడా ఇదే రోడ్లన్నీ నీలమయం, బురదమయం, పాములు తిరిగే ప్రదేశంలో ప్రజలందరికీ ఇల్లులు కట్టుకోమని స్థలాలు ఇచ్చారు. నవులూరులో గత ప్రభుత్వంలోనే 80% పూర్తయిన
ఇల్లు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయినా మిగిలిన నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వేడుక చూస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణంలో మరియు టిడ్కో గృహాల కేటాయింపులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి, లబ్ధిదారులకు రావలసిన ఇళ్లను వెంటనే కేటాయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని కచ్చితంగా జనసేన పార్టీ తరఫున ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి పట్టణ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరరావు, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి తదితరులు పాల్గొన్నారు.