పుంగనూరు మండలాద్యక్షుల సమావేశం

పుంగనూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ వర్గ విభేదాలు ఉండకూడదని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ ఆదేశాల మేరకు శనివారం పుంగనూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిన్నా రాయల్, జిల్లా కార్యదర్శి పగడాల రమణ అధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల పార్టీ అధ్యక్షులతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య అంశం జనసేన పార్టీ కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీతో ఏవిధంగా కార్యక్రమలు చేయాలని ఏకాభిప్రాయంతో అందరి ఆమోదంతో జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో ఏవిధంగా బలోపేతం చేయాలని అందరు కలిసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పోగ్రామ్స్ కన్వీనర్ చైతన్య రాయల్, నియోజవర్గ ఐటీ ఇంచార్జీ దేసాది వికాస్, పుంగనూరు రూరల్ అధ్యక్షులు విరూపాక్ష, టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, సోమల అధ్యక్షులు భూషణ్ రాయల్, పులిచర్ల అధ్యక్షులు దేపా మోహన్, ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, బాలాజీ నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు నందు, కార్యదర్శి కేవీ రమణ, సీన తదితరులు పాల్గొన్నారు.