జనసేన కార్మిక నాయకుడు సోము ఉదయ్ కు అండగా నిలిచిన దార్ల మహేష్

జనసేన పార్టీ కార్మిక నాయకుడు, అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండగా.. జనసేన జెండా పట్టుకుని ప్రశ్నించే గొంతు, సమస్యలపై పోరాడే నైజం ఉన్న వ్యక్తి,, మిత్రుడు సోము ఉదయ్ ని లాలాపేట పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే.. గుంటూరు తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి దార్ల మహేష్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి స్టేషన్ ఎస్.హెచ్.ఓ గారిని ఒప్పించి సొంత పూచీకత్తుపైన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది.