పవన్ కళ్యాణ్ అభిమానులకి దసరా కానుక

దసరా పండుగ పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్​టైన్​మెంట్స్ మరో సినిమా ప్రకటన చేసింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా దర్శనమివ్వనున్నారు పవన్. సాగర్ చంద్ర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను విజయదశమి పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్​ సాబ్​’. వేణు శ్రీరామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నివేదా థామస్​ కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్​ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, చివరి షెడ్యూల్​ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, నివేదా థామస్ సినిమా సెట్స్​లో అడుగుపెట్టింది. ఆ ఫొటోను ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే పవన్​ కూడా షూటింగ్​లో పాల్గొననున్నారు.