అగ్ని ప్రమాదం బాదితులను ఆదుకున్న దాసరి రాజు

ఇచ్చాపురం: సోంపేట మండలం, బారువ మేజర్ పంచాయతీ బారువకొత్తూరులో పెట్ట సూర్యనారాయణకు చెందిన ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్వాక్రాలో అప్పు చేసిన లక్ష రూపాయలు మరియు ఆమె టైలరింగ్ చెందిన బట్టలు కాలి బూడిద అయిన విషయం తెలిసిన ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు వెళ్లి పరామర్శించి, తక్షణ సాయం కింద నిత్యవసర వస్తువులు బియ్యం ఇచ్చి తర్వాత అన్ని విధాల ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వర్ పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన జసైనికులు వాసుపల్లి అశోక్ తోట పురుషోత్తం వాసుపల్లి ప్రేమ్ సౌర పిల్లి మోహన్ తోట గోవింద్ సిరిడి దానయ్య సురేందర్ సోమేశ్ మరియు తేజ సంతోష్ ప్రతాప్ పాల్గొన్నారు.