ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మున్సిపాలిటీకి చెందిన పురుషోత్తపురం ఉన్నత పాఠశాలను విద్యార్థులు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి దాసరి రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సుమారుగా 625 మంది విద్యార్థులు ఉండగా అందులో 10వ తరగతి విద్యార్థులు 120 మంది ఉన్నారు. వీళ్లందరికీ కేవలం 7గురు ఉపాధ్యాయులు మాత్రమే వున్నారు. హిందీ సబ్జెక్ట్ కి టీచర్ లేరు. 24 మంది టీచర్స్ వుండాల్సిన దగ్గర కేవలం 7గురు టీచర్స్ వున్నారు. ప్రిన్సిపల్ మేడంని ఆడిగేతే ఆమె కూడా నిశ్శహాయత వ్యక్తపరుస్తున్నారు. విద్యార్థులు భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఇదే స్కూల్లో చదివిన ఇంతకుముందు విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయినవారు వున్నారు. 15 రోజుల్లోగా సంబంధిత టీచర్స్ ని వేయాని యెడల ఆ స్కూలు పైన ఆధారపడే ముచ్చిందర, పురుషోత్తపురం బేగంపేట ఏఎస్ పేట గ్రామాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు జనసేన ఇంచార్జి దాసరి రాజు గారికి చెప్పగా అందరం కలిసి వెళ్దాం అంటే మేము వస్తే 50 ఇళ్లకు ఉన్న వాలంటి రులు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మాకు రావాల్సిన పథకాలు రాకుండా చేస్తారు అని అంటున్నారు. అందువల్ల జనసేన బాధ్యతతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాది. పరిష్కారం కానీ యెడల విద్యార్థులు తల్లిదండ్రులతో పాఠశాల ఆవరణలో జనసేన తరుపున శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. డి.ఈ.ఓ గారికి మరియు ఎం.ఈ.ఓకి పత్రికా ముఖంగా తెలియజేసారు. ఈ తనిఖీలు ఇచ్చాపురం మున్సిపాలిటీ వార్డు ఇన్చార్జిలో రోకళ్ళ భాస్కరరావు కళ్య గౌడు పురుషోత్తపురం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.